ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్యగమనిక!

26 Nov, 2023 11:17 IST|Sakshi

ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక. నవంబర్‌ 26, 2023న ఎస్‌బీఐ యూపీఐ పేమెంట్స్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయని ఎస్‌బీఐ ట్వీట్‌  చేసింది. 

ఎస్‌బీఐ యూపీఐలో సర్వర్ల పనితీరు, అప్‌గ్రేడ్‌ చేస్తున్న నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్‌ చేసేందుకు వీలు లేదని తెలిపింది. అయితే అదే సమయంలో ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ యోనో లైట్‌, ఏటీఎం సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. 

ఎస్‌బీఐ ట్వీట్‌ మేరకు.. ‘మేం నవంబర్ 26, 2023న 00:30 గంటల నుంచి 03:00 గంటల (అర్ధరాత్రి) మధ్య యూపీఐలో టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయనున్నాం.ఈ సమయంలో ఎస్‌బీఐ యూపీఐ తప్ప ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యోనో లైట్, ఏటీఎంతో సహా మా ఇతర డిజిటల్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి.’ అని పేర్కొంది.

మరిన్ని వార్తలు