షావోమి వేగం : మరో బిగ్‌ టీవీ లాంచ్‌

22 Nov, 2018 16:05 IST|Sakshi

75 అంచుల షావోమీ  టీవీ

8జీబీ స్టోరేజి, 4కె డిస్‌ప్లే

ధర రూ. 82, 100

సాక్షి,ముంబై:  మొబైల్స్ తయారీదారు షావోమీ టీవీ సెగ్మెంట్‌లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇటీవీల టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టిన షావోమి వరుసగా లాంచ్‌లతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా 75 ఇంచులఎంఐ టీవీ 4ఎస్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది, ఈ రోజు నుంచే  సేల్స్‌ను  ప్రారంభించింది. దీని ధరను రూ.82,100గా నిర్ణయించింది. 

ఇక ఈ టీవీ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే  క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డీటీఎస్ హెచ్‌డీ డాల్బీ ఆడియో, బ్లూటూత్, వైఫై తదితరాలు లభిస్తున్నాయి.

మరిన్ని వార్తలు