షావోమి న్యూ ప్లాన్‌: గిఫ్ట్‌ కార్డ్‌

3 Apr, 2018 16:16 IST|Sakshi

షావోమి సరికొత్త ప్లాన్‌

ఎంఐ గిఫ్ట్‌కార్డ్‌

ఈ మెయిల్‌ద్వారా గిఫ్ట్స్‌

ఇంట్రెస్టింగ్‌ పెర్పనలైజ్డ్‌ కార్డ్‌

సాక్షి, న్యూఢిల్లీ: షావోమి  భారత కస‍్టమర్లను  ఆకట్టుకునేందుకు  మరో ప్రణాళికను సిద్ధం చేసింది. ఎంఐ గిఫ్ట్‌కార్డ్‌  ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమెయిల్‌ ద్వారా గిఫ్ట్‌లను  అందించేలా ఎంఐ గిఫ్ట్‌కార్డ్‌ను ప్రవేశపెట్టింది.  దీని ద్వారా పుట్టినరోజు, వార్షికోత్సవం, అభినందనలు తెలిపేందుకు లాంటి సందర్భాల్లో ఈ బహుమతులను అభిమానులకు, సన్నిహితులకు పంపుకోవచ్చు.  

రూ.100నుంచి  గరిష్టంగా రూ.10వేల దాకా  షావోమి ఉత్పత్తులను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.  ఒక లావాదేవీలో గరిష్ట 10గిఫ్ట్‌ కార్డులను ఉపయోగించవచ్చు ఎంఐ.కాం, లేదా ఎంఊస్టోర్‌ యాప్‌ ద్వారా  స్మార్ట్‌ఫోన్ల నుంచి టెలివిజన్‌ దా​కా స్మార్ట్‌   ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీటిని  ప్రవేశపెట్టింది. ఎస్‌ఏఏఎస్‌ ఆధారిత ప్రీపెయిడ్ కార్డు సొల్యూషన్స్ ప్రొవైడర్ క్విక్‌కిల్వర్‌తో జత కట్టింది.  అంతేకాదు ఎంఐ.కామ్‌  లేదా మి స్టోర్ స్టోర్లలో ఈ గిఫ్ట్‌ కార్డులను..కార్డుల గ్యాలరీ నుంచి ఎంచుకోవచ్చు లేదంటే.. మనకిష్టమైన ఫోటోను, ఇమేజ్‌ లేదా డిజైన్‌ను అప్‌లోడ్‌ చేసి ఆకర్షణీయమైన పెర్సనలైజ్డ్‌ కార్డ్‌ను కూడా పొందవచ్చు.  డిజిటల్ గిఫ్టింగ్ భారతదేశంలో  లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో​ క్విక్‌కిల్వర్‌  భాగస్వామ్యంతో డిజిటల్‌ గిఫ్టింగ్‌ పథకాన్ని లాంచ్‌ చేశామని షావోమి ఇండియా  ఆన్‌లైన్‌ సేల్స్‌ హెడ్‌ రఘురెడ్డి వెల్లడించారు.  

గిఫ్ట్‌కార్డ్‌ పొందాలంటేగిఫ్ట్‌ కార్డును రీడీమ్ చేయడానికి, ఎంఐస్టోర్‌ యాప్‌లోకి వెళ్లి.. మై అకౌంట్‌ క్లిక్‌ చేసి ..యాడ్‌ గిఫ్ట్‌కార్డ్‌ను ఎంచుకోవాలి.  16 డిజిట్‌ నెంబర్‌ను, ఈమెయిల్‌ ద్వారా మనకు అందిన 6డిజిట్‌ పిన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. యాడ్‌ గిఫ్ట్‌కార్డ్‌ను క్లిక్‌ చేసి మన ఖాతాను చెక్‌ చేసుకోవచ్చు.  దీనిద్వారా కస్టమర్లకిష్టమైన ఉత్పత్తిని ఎంచుకుని గిఫ్ట్‌గా మన కిష్టమైనవారికి పంపుకోవచ్చు. 

కొనుగోలు ఎలా చేయాలంటే:ఎంఐ గిఫ్ట్ కార్డుద్వారా కొనుగోలు చేయడానికి షావోమి  వెబ్‌సైట్‌ స్పెషల్‌ పేజ్‌ను విజిట్‌ చేయాలి. ఎంఐ  గిఫ్ట్ కార్డ్‌ను  సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ  తరువాత గిప్ట్‌ పంపేవారి, గిప్ట్‌ అందుకునే వారి,చిరునామా,ఇతర సమాచారాన్ని నింపాలి. తరువాత మెసేజ్‌ , బహుమతి కార్డుతోపాటు డెలివరీ తేదీ వంటి వివరాలను పూరించాలి. ఈ ప్రక్రియ ఒకసారి పూర్తయితే,  క్రెడిట్ /డెబిట్ కార్డు/ ఈఎంఐ/ యూపీఐ  ద్వారా చెల్లింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, స్వీకర్తకు ఒక ఇమెయిల్  అందుతుంది. దీంతోపాటు లావాదేవీ వివరాలు , గిఫ్ట్‌కార్డులో  ఇంకా మిగిలి ఉన్న బ్యాలెన్స్ వంటి సమాచారం కూడా వినియోగదారుడికి అందుతుంది.

ముఖ్యంగా, ఈ కార్డ్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది.  ఒకవేళ  ప్రొడక్ట్‌ను రిటర్న్‌ చేస్తే .. దాని విలువ తిరిగి గిఫ్ట్‌కార్డ్‌ ఖాతాలో జమ అవుతుంది. 

మరిన్ని వార్తలు