పొదుపు వడ్డీ రేటు తగ్గించిన యస్‌ బ్యాంక్‌

17 Aug, 2017 00:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ‘యస్‌ బ్యాంక్‌’ తాజాగా సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్స్‌ (పొదుపు ఖాతాలు) పై వడ్డీ రేటును 1 శాతం వరకు తగ్గించింది. దీంతో రూ.లక్ష లోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 5 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంక్‌ రూ.లక్షకు పైన, రూ.కోటి లోపు ఉన్న డిపాజిట్లకు ఎప్పటిలాగే  6 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. రూ.కోటి పైన ఉన్న డిపాజిట్ల విషయానికి వస్తే వడ్డీ రేటును 6.5% నుంచి 6.25%కి తగ్గించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది. కాగా ఇప్పటికే ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకులు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించడం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు