జాక్‌పాట్‌ కొట్టేసిన ఎస్‌ బ్యాంకు 

31 Oct, 2019 13:48 IST|Sakshi

సాక్షి, ముంబై : వివాదంలో చిక్కుకుని సంక్షోభంలో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు ఎస్‌బ్యాంకు జాక్‌ పాట్‌ కొట్టినట్టు తెలుస్తోంది.  గ్లోబల్ ఇన్వెస్టర్  ద్వారా భారీ పెట్టుబడులను సాధించనుంది. 1.2 బిలియన్ (సుమారు రూ.8400 కోట్లు) డాలర్ల పెట్టుబడి బైండింగ్ ఆఫర్ అందుకున్నట్లు ఎస్‌బ్యాంకు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈక్విటీ వాటాల ద్వారా ఈ పెట్టుబడులనుపొందనున్నట్టు తెలిపింది. అయితే ఇది రెగ్యులేటరీ ఆమోదాలు / షరతులతో పాటు బ్యాంక్ బోర్డు, వాటాదారుల ఆమోదాలకు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఈ ప్రకటన తర్వాత ఎస్‌ బ్యాంకు షేర్లు 35 శాతం జంప్‌ చేశాయి. 

హాంకాంగ్‌కు చెందిన ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ ఈ భారీ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించింది. అలాగే ఇతర దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చలు పురోగతిలో ఉన్నాయని కూడా  బ్యాంకు తెలిపింది. నవంరు 1న విడుదల చేయనున్న త్రైమాసిక ఫలితాల సందర‍్భంగా ఈ డీల్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.  కాగా నిధుల సేకరణ కోసం ఇతర ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారులతో చర్చలను ముమ్మరం చేసిన నేపథ్యంలో తాజా పెట్టుబడులను సాధించింది. అదనపు మూలధనాన్ని సమీకరించడానికి  ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, వ్యూహాత్మక పెట్టుబడిదారులు చర్చలు జరుపుతున్నట్లు సీఈఓ రవ్‌నీత్ గిల్ సెప్టెంబర్ 25న  ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు