అడాగ్ గ్రూప్ టీవీ చానళ్లు జీ చేతికి

12 Dec, 2016 15:03 IST|Sakshi
అడాగ్ గ్రూప్ టీవీ చానళ్లు జీ చేతికి

రేడియో వ్యాపారంలో 49 శాతం వాటా కూడా
లావాదేవీ విలువ రూ. 1,900 కోట్లు 

న్యూఢిల్లీ: అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన టీవీ చానళ్లను సుభాష్ చంద్రకు చెందిన జీగ్రూప్ కొనుగోలు చేయనుంది. ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ చానళ్లలో 100 శాతం వాటాతో పాటు రిలయన్‌‌స రేడియో వ్యాపారంలో 49 శాతం వాటాను కూడా అడాగ్ విక్రరుుస్తోంది. ఈ మేరకు ఇరు గ్రూప్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆయా కంపెనీల బోర్డులు ఈ ఒప్పందాన్ని ఆమోదించారుు. ఈ మొత్తం లావాదేవీ విలువ రూ.1,900 కోట్లు. జీగ్రూప్ కంపెనీ అరుున జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రెజైస్ తమ టీవీ వ్యాపారాన్ని పూర్తిగా కొనుగోలు చేసిందని, జీ మీడియా కార్పొరేషన్‌కు తమ రెడియో వ్యాపారంలో 49 శాతాన్ని విక్రరుుస్తున్నామని రిలయన్‌‌స క్యాపిటల్ ఒక ప్రకటనలో తెలియజేసింది.

తమకు ప్రధానం కాని వ్యాపారాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ విక్రయాలు జరిపినట్లు అడాగ్ తెలియజేసింది. హిందీలో బిగ్ మ్యాజిక్ పేరుతో ఒక కామెడీ చానల్, భోజ్‌పురి భాషలో బిగ్ గంగా పేరుతో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌ను అడాగ్ గ్రూపు నిర్వహిస్తోంది. అలాగే ఈ సంస్థకు 45 ఎఫ్‌ఎం రెడియో స్టేషన్లు కూడా ఉండగా... మరో 14 కొత్త లెసైన్సుల్ని ఇటీవల వేలంలో దక్కించుకుంది. ఈ రేడియో వ్యాపారంలో రిలయన్‌‌స తనకున్న వాటాను కొత్తగా ఏర్పాటుచేసే ఒక సంస్థకు బదిలీ చేస్తుంది. ఈ కొత్త సంస్థలో జీ 49 శాతం వాటాను తీసుకుంటుంది.

మరిన్ని వార్తలు