విషాదం : ఎద్దును తప్పించబోయి..

23 Nov, 2019 19:24 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. హైవేపై వెళ్తున్న మినీ బస్సుకు ఎదురుగా వచ్చిన ఎద్దును తప్పించబోయి చెట్టును బలంగా డీకొట్టడంతో 12 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు.  వివరాల్లోకి వెళితే..  మహారాష్ట్రలోని లాతూర్‌ నుంచి హర్యానాలోని హిసార్‌కు వెళ్లేందుకు శుక్రవారం మద్యాహ్నం మినీ బస్సులో 22మంది బయలుదేరారు.

ఈ నేపథ్యంలో  మినీ బస్సు నాగౌర్‌ జిల్లాలోని కచ్‌మన్‌ జాతీయ రహదారి వద్దకు రాగానే ఒక ఎద్దు ఎదురుగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ ఎద్దును తప్పించడానికి సడెన్‌ బ్రేక్‌ వేశాడు. కానీ అప్పటికే బస్సు ఓవర్‌స్పీడ్ ఉండడంతో అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌తో సహ 12 మంది మృతి చెందగా వారిలో ఆరుగురు మహిళలున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని స్ధానికుల సాయంతో మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. కాగా మిగతా 10 మందిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని జైపూర్‌లోని ఎస్‌మ్మెఎస్‌ ఆసుపత్రికి తరలించగా, మిగతావారిని నాగౌర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు