రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్‌

11 Oct, 2019 22:22 IST|Sakshi

సాక్షి, కర్నూలు: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వోద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు. సంజామల  తహసీల్దార్‌ గోవింద్‌ సింగ్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. రైతు జె.రామేశ్వరరెడ్డికి చెందిన పొలం పాసు బుక్కును ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు తహసీల్దార్‌ లంచం డిమాండ్‌ చేయగా.. ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలోని బృందం తహసీల్దార్‌ గోవింద్‌ సింగ్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. గోవింద్‌ సింగ్‌ బ్యాంకు ఖాతాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. స్టేట్‌ బ్యాంకు,ఆంధ్రా బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్టేట్‌ బ్యాంక్‌ లాకర్‌ను తనిఖీ చేయగా కోటి తొమ్మిది లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రూ.16 లక్షల నగదును, రూ.15 లక్షల విలువ చేసే బంగారం, ఐదు ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. ఆంధ్రాబ్యాంక్‌ లాకర్‌ తెరవాల్సి ఉంది.

మరిన్ని వార్తలు