ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

31 Jul, 2019 11:47 IST|Sakshi

నటుడు అజిత్‌ అభిమానిపై నటుడు విజయ్‌ అభిమాని కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో విజయ్‌ అభిమానిని పుళల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు. పుళల్‌ సమీపంలోని కావంగరైలో శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివశిస్తున్న ఉమాశంకర్‌(32) నటుడు అజిత్‌కు వీరాభిమని. అక్కడే నివసిస్తున్న రోషన్‌(34)అనే వ్యక్తి నటుడు విజయ్‌ అభిమాని.

కాగా వీరిద్దరు సోమవారం రాత్రి కలిసి మాట్లాడుకుంటుండా నటులు విజయ్,అజిత్‌ల గురించి చర్చ వచ్చింది. ఈ చర్చలో ఇద్దరి మధ్య భేదాప్రాయాలు చోటు చేసుకోవడంతో గొడవకు దారి తీసింది. ఆగ్రహించిన విజయ్‌ అభిమాని రోషన్‌ ఉమాశంకర్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. గాయపడిన అతన్ని స్థానికులు పాడియ నట్లూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు.

పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో పుళల్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రోషన్‌ను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. ఇటీవల విజయ్, అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదిక రచ్చచేస్తున్న విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

ఆశ పడింది.. అడ్డంగా దొరికింది

దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు

యువకుడి దారుణహత్య

కుమార్తెపై లైంగికదాడికి యత్నం  

పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అంటూ..

ఫోర్జరీ సంతకాలతో 1.30కోట్లు స్వాహ!

కలెక్టరేట్‌ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం

నెత్తురోడిన రహదారులు

కొంపల్లిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

ప్రేమించి పెళ్లాడి ఆపై..

బాంబు పేలుడు..34 మంది మృతి!

‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

పీఈటీ పాడుబుద్ధి.. !

మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

క్యూనెట్‌ బాధితుడి ఆత్మహత్య

నేరాలు.. ఘోరాలు!

మాజీ ఎంపీ భార్య హత్య: కుమారుడి అరెస్టు

పథకం ప్రకారమే హత్య..

అవినీతిలో అందెవేసిన చేయి

రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ కొట్టేశారు..

వివాహేతర సంబంధమే ఊపిరి తీసింది.. !

ఈ కేటుగాడు... ఒకప్పటి ‘ఆటగాడు’

అమ్మను కాపాడుకోలేమా?

9 నెలల క్రితం అదృశ్యం.. 6 నెలల గర్భిణిగా ప్రత్యక్షం

పోలీసుల వలలో మోసగాడు

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

కిడ్నాప్‌ కథ సుఖాంతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు