సోదరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అన్న అరెస్ట్‌

16 May, 2019 08:25 IST|Sakshi
నిందితుడు సంతోష్‌

మల్కాజిగిరి:  సోదరి వరుసయ్యే బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అన్నను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ సంజీవరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి పటేల్‌నగర్‌కు చెందిన బాలరాజ్, భాగ్యలక్ష్మి దంపతులు నాచారంలోని ఓ కంపెనీ క్యాంటిన్‌లో పని చే సేవారు.

ఆలేరులో ఉంటున్న తన సోదరుడితో బాలరాజ్‌కు స్ధల వివాదం నడుస్తోంది. మంగళవారం ఈ విషయం మాట్లాడేందుకు అతడి సోదరుడి కుమారుడు సంతోష్‌ మల్కాజిగిరికి వచ్చాడు. సాయంత్రం స్థలం విషయం  మాట్లాడుకున్న అనంతరం బాలరాజ్‌ భార్యతో కలిసి పనికి వెళ్లాడు.  ఆ తర్వాత మద్యం తాగి ఇంటికి వచ్చిన సంతోష్‌  బాలరాజ్‌ కుమార్తె పట్ల అసభ్యకంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయం తల్లితండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం నిందితుడడు సంతోష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు