ఇద్దరు వైద్యులపై కేసులు..!

28 Apr, 2018 07:56 IST|Sakshi
చిత్తూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం తనిఖీలు చేస్తున్న అధికారులు

లైసెన్సు రద్దుకు ప్రతిపాదనలు

కలెక్టర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఫిర్యాదు

లింగ నిర్దారణ వ్యవహారం

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులో కలకలం రేపిన లింగ నిర్దారణ స్కానింగ్‌ కేంద్రాలు, భ్రూణ హత్యలకు పాల్పడే వైద్యులపై కేసులు నమో దు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ) డాక్టర్‌ స్వర్ణ విజయగౌరి తెలిపారు. నగరంలోని నాయుడు బిల్డింగ్స్‌లో డాక్టర్‌ శోభ, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తూ.. సుందరయ్యవీధిలో స్కానింగ్‌ సెంటర్‌ నడుపుతున్న మరో మహిళా డాక్టర్లను  ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం గురువారం  లింగ నిర్దారణలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. తిరుచానూరుకు చెందిన సునీత చిత్తూరు హైరోడ్డులో ఓ గదిని అద్దెకు తీసుకుని లింగ నిర్ధారణ, అబార్షన్లకు గర్భిణులను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళుతుండగా రహస్య కెమెరాల్లో   చిత్రీకరించిన కేంద్ర బృందం దాడులు చేసింది.

ఈ రెండు ఆస్పత్రులతో పాటు నగరంలోని పలు ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు లింగ నిర్ధా్దరణ చేస్తూ అబార్షన్లు చేస్తున్నట్టు సునీత అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో మరికొన్ని ఆస్పత్రులపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరోవైపు కేంద్ర బృందం ఆధ్వర్యంలో చేపట్టిన డెకాయ్‌ ఆపరేషన్‌లో పట్టుబడ్డ ఇద్దరు వైద్యాధికారుల లైసెన్సులు రద్దు చేసేందుకు రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌కు నివేదిక పంపనున్నట్లు   డీఎంఅండ్‌హెచ్‌ఓ పేర్కొన్నారు గర్భస్థ పిండ లింగ నిర్ధా్దరణ నిషేధ చట్టం జిల్లా చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌కు నివేదించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్యకు ఫిర్యా దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన వైద్యుల్లో ఒకరు ఏపీ వైద్యవిధాన్‌ పరిషత్‌లో ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తుండంతో ప్రిన్స్‌పల్‌ కార్యదర్శి  చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు