కశ్మీర్‌లో అబిద్‌ ?

17 Feb, 2019 12:02 IST|Sakshi
అబిద్‌ మాలిక్‌ ఫేస్‌బుక్‌ పేజీ

సీసీబీ పోలీసుల గాలింపు  

కర్ణాటక, కృష్ణరాజపురం: కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిపై హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో సందేశం పోస్ట్‌ చేసిన కశ్మీర్‌కు చెందిన అబిద్‌ మాలిక్‌ అనే యువకుని కోసం సీసీబీ పోలీసులు వేట తీవ్రతరం చేశారు. అబిద్‌ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలతో పాటు ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సీసీబీ అదనపు కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గాలింపు జరుగుతోంది. కశ్మీర్‌కు చెందిన ఇతడు నగరంలోనే చదువుకుని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆత్మాహుతి దాడిని అసలైన సర్జికల్‌ స్ట్రైక్‌గా ఫేస్‌బుక్‌లో వర్ణించడం తెలిసిందే. అతని జాడ కోసం అన్ని రాష్ట్రాల పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్న బెంగళూరు సీసీబీ పోలీసులు అతడు కశ్మీర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఎన్‌ఐఏకు సమాచారం అందించారు. అబిద్‌పై కన్నడ పోరాట సంఘాల నేత నాగేశ్‌గౌడ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అబిద్‌ మాలిక్‌తో పాటు అతని ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో ఉన్న అబ్దుల్‌ హనీఫ్, సుల్తాన్‌ అహ్మద్, అమీన్‌ షరీఫ్, ఉమర్‌ ఫార్జీ, సల్మాన్‌ అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు