ఒంటరి మహిళలే టార్గెట్‌

28 Aug, 2019 11:48 IST|Sakshi

నేరేడ్‌మెట్‌: బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ అతి చిన్న కత్తితో  ఒంటరి మహిళలను బెదిరించి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న యువకుడిని ఎల్‌బీ.నగర్‌  సీసీఎస్, క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రం, బివాని జిల్లా, బర్సి గ్రామానికి చెందిన ఖుసారియా దతారామ్‌ బాలాపూర్‌లోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉంటూ కొత్తపేటలోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.  

డ్యూటీ ముగిసిన అనంతరం బైక్‌పై ఎల్‌బీనగర్, సరూర్‌నగర్, మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ..ఒంటరి మహిళలు, యువతులను వెంబడించి చెయిన్‌ స్నాచింగ్‌కు పాల్పడటంతోపాటు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.  కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం ఎల్‌బీ.నగర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన దతారామ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు అంగీకరించాడు.  అతడి నుంచి బుల్లి కత్తి, రూ.35వేల విలువైన చోరీ సొత్తుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. క్రైం ఇన్‌చార్జి డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్న కూతురి హత్యకు తల్లి యత్నం

జల్సాల కోసం చోరీల బాట

చెక్కు పంపిస్తానని చెక్కేశాడు..

రూ. 10 లక్షల రుణం కోసం రూ.11లక్షలు వసూలు

భూమి కోసం ఘర్షణ

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

అయ్యో..పాపం పసికందు..!    

పోలీసు శాఖలో.. 'మెమో' కలకలం

ఆత్మహత్యలకు కేరాఫ్‌గా.. రైల్వేట్రాక్స్‌

పాత సామాన్లకు ఉల్లిపాయలంటూ..!

దంపతులు ఇద్దరూ ఒకే రీతిలో..

పక్కా ప్లాన్‌తో; భయానక స్థితిలో మృతదేహం

పరారీలో  మాజీ విప్‌ కూన రవికుమార్‌

సవతే హంతకురాలు

పాన్‌షాప్‌తో జీవితం ప్రారంభించి.. గుట్కా డాన్‌గా..!

ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి 

హుండీ దందా గుట్టురట్టు 

ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు..

‘క్యూనెట్‌’పై ఈడీ

స్వామిపై లైంగిక ఆరోపణలు, బాధితురాలు మాయం

అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష

క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ

తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య

రమేష్‌ హత్య వెనుక రహస్యాలనేకం..!

మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని..

బైక్‌ మోజులో పడి.. మేనత్తకే కన్నం

గంటలో మూడు ఫోన్లు చోరీ

బడా బిజినెస్‌మెన్‌ అంటూ వలేస్తాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం