ట్రూకాలర్‌ నుంచి ఫొటోలు ఆపై మార్ఫింగ్‌..!

3 Jul, 2019 19:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియాలో యువతుల ఫొటోలు సేకరించి మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ ఘరానా మోసగాన్ని సిటీ సైబర్‌క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దాదాపు 300 మంది యువతుల ఫొటోలను సేకరించిన వైజాగ్‌కు చెందిన పాడు వినోద్‌కుమార్‌ వాటిని మార్ఫింగ్‌ చేసి పోర్న్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్నాడు. ఫొటోలు డిలీట్‌ చేయాలంటే డబ్బు చెల్లించాలంటూ సదరు యువతులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నాడు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

(చదవండి : మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం)

ట్రూకాలర్‌, ఇన్‌స్టా నుంచి ఫోటోలు
వైజాగ్‌కు చెందిన పాడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేశాం. నిందితుడు ట్రూ కాలర్, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్ మీడియాలో యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లు సేకరించాడు. యూట్యూబ్‌లో చూసి మార్పింగ్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని యువతుల ఫోటోలను మార్పింగ్ చేశాడు. మార్ఫింగ్ చేసిన యువతుల పోటోలను డేటింగ్ సైట్లు, పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేశాడు. అనంతరం బాధిత యువతులకు ఫోన్ చేసి పదివేలు ఇస్తే మార్పింగ్ చేసిన ఫోటోలను డిలీట్ చేస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఇంటర్ ఫెయిలైన వినోద్ వైజాగ్‌లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నాడు. అక్కడ కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ నేర్చుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడు. నిందితుడి మొబైల్‌లో 250 నుంచి 300 మంది యువతుల పోటోలు, మార్పింగ్ ఫోటోలు ఉన్నాయి. సోషల్ మీడియాను ప్రజలు జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయరాదు.
-సైబర్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రఘువీర్
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు