తల్లిదండ్రులు, చెల్లెలిపై బీటెక్‌ విద్యార్థి కిరాతకం

11 Oct, 2018 12:00 IST|Sakshi
మితిలేశ్‌ ఫ్యామిలీ ఫొటో (కర్టెసీ : ఏషియన్‌ ఏజ్‌)

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తన ‘స్వేచ్ఛ’కు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు, చెల్లెలిపై కోపం పెంచుకున్న బీటెక్‌ విద్యార్థి, వారిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఈ నేరాన్ని తండ్రిపై నెట్టాలని చూశాడు. చివరికి నేరాన్ని అంగీకరించి కటకటాలపాలయ్యాడు.

పోలీసుల వివరాల ప్రకారం... మిథిలేశ్‌ అనే ఇంటీరియర్‌ డిజైనర్‌ భార్యా పిల్లలతో కలిసి దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్నాడు. కొడుకు సూరజ్‌(19).. గురుగ్రామ్‌లోని ఓ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది చదువుతున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడ్డ సూరజ్‌ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. స్నేహితులతో తిరగొద్దని, వాళ్లను ఇంటికి తీసుకురావద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న సూరజ్‌.. వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా తన మొబైల్‌ చెక్‌ చేస్తూ వారికి తన గురించి చాడీలు చెబుతున్న చెల్లెల్ని(16) కూడా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన సూరజ్‌.. బెడ్‌రూంలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు.

కట్టుకథ అల్లాడు..
హత్య చేసిన తర్వాత ఇరుగుపొరుగు వారిని పిలిచిన సూరజ్‌ తన తల్లిదండ్రులు, చెల్లెల్ని దొంగలు చంపేశారని ఏడ్వడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా వారికి అనుమానం రాకుండా తనని తాను కత్తితో గాయపరచుకున్నాడు. ఈ ఘటనతో ఉలికిపడ్డ పక్కింటి వారు సూరజ్‌ను సముదాయించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే సూరజ్‌ ప్రవర్తనతో అనుమానం కలిగిన పోలీసులు అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. విచారణ జరుపుతున్న క్రమంలో హత్యకు కారణం దొంగలు కాదని.. తన తల్లి, చెల్లెలిని కత్తితో పొడిచింది తండ్రేనని.. అందుకే ఆయనను చంపానని సూరజ్‌ పోలీసులకు చెప్పాడు. కానీ మిథిలేశ్‌కు అలాంటి వాడు కాదని.. భార్యా పిల్లలను ప్రేమగా చూసుకునే వాడని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో సూరజ్‌ని మరోసారి లోతుగా విచారించారు. ఈ క్రమంలో కామన్‌ గేట్‌ తాళం చెవి ఆధారంగా నిందితుడు సూరజేనని కనిపెట్టగలిగారు.  

2013లో కిడ్నాప్‌ నాటకం...
చిన్ననాటి నుంచే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సూరజ్‌కు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్‌ మనీ సరిపోయేది కాదు. అంతేకాకుండా తమది సంపన్న కుటుంబమైనా తల్లిదండ్రులు తనకి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని 2013లో కిడ్నాప్‌ నాటకం ఆడాడు. స్నేహితుల దగ్గరే కొన్నాళ్లపాటు ఉన్న సూరజ్‌ కిడ్నాప్‌ అయ్యానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేశాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి

దృష్టిమరల్చి దొంగతనం.. ఇది ఆ గ్యాంగ్‌ పనే!

బాలికపై స్కూల్‌ అటెండర్‌ వేధింపులు

యువతిపై అత్యాచారం..

విద్యార్థినిలకు బ్లాక్‌మెయిల్‌..స్పందించిన సీఎం

కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’

పేరు తేడా.. పెళ్లి ఆపేసింది!

చీరల దొంగలు చీరాలకు వెళుతూ..

గృహిణి అదృశ్యం

అదుపు తప్పిన బాలుడు.. నగరంలో దందాలు

నగరాన్ని నంజుకుంటున్న నల్లజాతీయులు

ఏకాంతంగా దొరికారు.. గుండుకొట్టించారు!

అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి

రూ. 4వేలకు ఆరు నెలల చిన్నారి కొనుగోలు

అజ్ఞాతంలో ఉన్నా పసిగట్టారు

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

మహిళపై దుబాయ్‌ ఏజెంట్‌ లైంగిక దాడి

రాంగ్‌ రూట్‌లో రావొద్దన్నందుకు దాడి

‘అమ్మానాన్న' నేను వెళ్లిపోతున్నా..

గిరిజన బాలికపై అత్యాచారం

బావిలో చిన్నారి మృతదేహం

పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ..

నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ

సినీ కాస్ట్యూమర్‌ ఆత్మహత్య

‘జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్టు

దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పి లాడ్జిలో..

అసెంబ్లీ బాత్రూంలో గొంతు కోసుకుని

స్వామీజీకి వింత అనుభవం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!

ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి

హృతిక్‌ చేస్తే కరెక్ట్‌; సునయనది తప్పా!?

బిగ్‌బాస్‌.. అప్పుడే నాగ్‌పై ట్రోలింగ్‌!

‘రాక్షసుడు’ని భయపెడుతున్నారు!

‘అవును వారిద్దరూ విడిపోయారు’