వదంతులు నమ్మవద్దు

24 May, 2018 17:09 IST|Sakshi
కామారెడ్డి ఎస్సీ శ్వేతా రెడ్డి

నిజామాబాద్‌: సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులు నమ్మ వద్దని నిజామాబాద్‌ ఇంచార్జ్‌ సీపీ, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లా భీమగల్‌ మండలం చేంగల్‌లో ఓ గిరిజనుడిని దొంగగా భావించి గ్రామస్తులు దాడి చేయడంతో ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం హత్యా నేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మాకు సమాచారమిస్తే మేము స్పందిస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పారు. సురక్షిత సమాజాన్ని నిర్మించేందుకు పోలీస్‌ శాఖ నిరంతరం శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. అవసరమైన అన్ని చోట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. వదంతులను నమ్మకుండా ప్రజల్ని చైతన్యపరిచేందుకు కళాజాత ద్వారా వదంతులను తిప్పికొట్టేలా ప్రచారం చేస్తామని వివరించారు. జిల్లాలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు మా దృష్టికొస్తున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు