విద్యార్థులు, యువతే టార్గెట్‌

2 Apr, 2019 06:56 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు, లిక్విడ్‌ డ్రగ్స్, గంజాయి ప్యాకెట్లను చూపిస్తున్న పోలీసులు

డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి రిమాండ్‌

గంజాయి, నర్కోటిక్‌ డ్రగ్స్‌ పౌడర్, లిక్విడ్‌ స్వాధీనం

సుల్తాన్‌బజార్‌: నర్కోటిక్‌ డ్రగ్స్, గంజాయి, లిక్విడ్‌ డ్రగ్స్, డ్రగ్స్‌ సిగరెట్స్‌ను అమాయక విద్యార్థులకు విక్రయిస్తున్న ఓ యువకుడిని సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సుల్తాన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్, ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారామిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. నాంపల్లి రెడ్‌హిల్స్‌కు చెందిన షేక్‌ ఇమ్రాన్‌(25), డ్రగ్స్‌కు బానిసయ్యాడు.

గుర్తుతెలియని వ్యక్తుల వద్ద డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేసి వాటిని తానూ వినియోగించుకుంటూ యువతకు విక్రయిస్తుంటాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొగ్గులకుంట చౌరస్తాలోని బంగారు మైసమ్మ అలయం వద్ద వాహన తనికీలు నిర్వహిస్తున్న పోలీసులు షేక్‌ ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 10 ప్యాకెట్ల గంజాయి ముడిసరుకు, గంజాయితో నింపిన 5 సిగరేట్స్, 3 బాటిళ్ల లిక్విడ్‌ నర్కోటిక్‌ డ్రగ్స్‌ లభించాయి. దీంతో అతడి అదుపులోకి తీసుకుని విచారించగా మత్తు పదార్థాలకు బానిసైన విద్యార్థులు, యువతకు విక్రయిస్తుంటానని తెలడంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి ప్యాకెట్లు, లిక్విడ్‌ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును డీఎస్‌ఐ నరేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు