యువకుడిని ఇంత దారుణంగా.. ఇంతకీ ఆ సీసీ ఫుటేజీలో ఏముంది?

18 Nov, 2023 07:52 IST|Sakshi
వైన్‌ షాపు ముందు మృతిచెంది ఉన్న భోజరాం

సాక్షి, ఆదిలాబాద్‌: పట్టణంలోని గాంధీగంజ్‌ ఎదురుగా గల ఓ వైన్‌షాపు ముందు శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి..కుభీర్‌ మండలం పార్డి(బి)కి చెందిన ఉమ్డె భోజరాం(25) వైన్స్‌ ముందు పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ సీఐ ఎల్‌.శ్రీను అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఏరియాస్పత్రికి తరలించారు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తండ్రి చాంద్‌రాం పేర్కొన్నారు. వైన్‌ షాపులో సీసీ ఫుటేజీ పరిశీలించి పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సీఐని వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు.

మరిన్ని వార్తలు