ప్రేమికుడి వినోదం

2 Apr, 2019 06:39 IST|Sakshi
నిక్కీ, ప్రభుదేవా

ప్రభుదేవా హీరోగా, అదాశర్మ, నిక్కీగల్రాని హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్‌’. ఈ చిత్రాన్ని ఎమ్‌.వి. కృష్ణ సమర్పణలో శ్రీ తారకరామ పిక్చర్స్‌ పతాకంపై వి.శ్రీనివాసరావు తెలుగులోకి ‘మిస్టర్‌ ప్రేమికుడు’ పేరుతో అనువదిస్తున్నారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రభుదేవా హీరోగా నటించిన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం.

అందుకే ఆయన నటించిన లేటెస్ట్‌ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. తెలుగు అనువాద కార్యక్రమాలు ఫైనల్‌ దశలో ఉన్నాయి. త్వరలో ఆడియోను, ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్‌; కెమెరా: సౌందర్‌ రాజన్, సహ నిర్మాతలు: మహేష్‌ చౌదరి గుర్రం, శంకరరావు సారికి.

మరిన్ని వార్తలు