జీడిమెట్ల కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

21 Sep, 2019 08:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం కార్తికేయ కామాక్షి కెమికల్‌ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంటలు చెలరాగాయి. ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్ డ్రమ్ములు ఒక్కొక్కటిగా పేలుతుండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు కంపెనీ చుట్టూ వ్యాపించాయి. పెద్ద ఎత్తున శబ్ధాలు వస్తుండటంతో భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ, భారీగానే ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు