ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టు

30 Jul, 2019 13:03 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలను మోసగించిన ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టయ్యారు. ఇరిడియం కాపర్ బిందెలతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి 15మంది నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి షేక్‌ సర్దార్‌ హుస్సేన్‌ పరారయ్యాడు. ఇరిడియం బిందెల కోసం అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ, ఆర్కియాలజీ శాఖ అనుమతులు కూడా ఉన్నాయని అతను నమ్మబలికాడు. అంతేకాకుండా ఆ రెండు సంస్థలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నకిలీ లెటర్‌ హెడ్‌లు చూపించి.. ప్రజలను బురిడీ కొట్టించాడు సర్దార్‌ హుస్సేన్‌. రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ. 500 కోట్లు కంటైనర్‌లో వస్తున్నాయని మోసం చేశాడు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీసులకు అతడు తాజాగా పట్టుబడ్డాడు.

మరిన్ని వార్తలు