పుట్టలో పాలుపోసి వచ్చాక.. ఇలా జరగడంతో.. భయాందోళనలో స్థానికులు!

19 Nov, 2023 10:57 IST|Sakshi
భారతి (ఫైల్‌)

నాగదేవతకు పూజలు..

నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలుపోసిన మహిళ!

పాముకాటుతో మహిళ మృతి..

మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు!

సాక్షి, కరీంనగర్: నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలుపోసిన ఓ మహిళ.. తన కుటుంబసభ్యులను సల్లంగా చూడాలని వేడుకుంది. నాగదేవతకు పూజలుచేసింది. ఆ రాత్రే ఆమె అనూహ్యంగా పాముకాటుకు గురై ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌ పరిధి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొడ్డెల భారతి(40) శుక్రవారం రాత్రి పాముకాటుతో మృతి చెందింది.

ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో కింద వేసుకున్న దుప్పట్లలో దూరిన పాము భారతినికాటు వేసింది. ఏదో కుట్టినట్లుగా ఉండడంతో నిద్రలేచేసరికి పాము కనిపించిందని, శరరంపై గాట్లు కూడా ఉండడంతో వెంటనే స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు.. గోదావరిఖనికి తరలించగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా నాగులపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించిన సదరు మహిళ.. పాముకాటుకు గురికావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇవి చదవండి: వివాహం కావడంలేదని.. యువకుడు మనస్తాపంతో ఇలా..

మరిన్ని వార్తలు