ఉద్యోగాల పేరుతో భారీ మోసం

8 Aug, 2018 20:22 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ముఠాను చొప్పదండి పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట జిల్లాలకు చెందిన దాదాపు 40 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి  వారి నుంచి సుమారు 85 లక్షలు వరకు వసూలు చేశారు. అనంతరం వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసి పారిపోయారు. దీంతో బాధితులు ఆ ముఠా సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి నకిలీ రబ్బర్‌ స్టాంపులు, బాండ్‌పేపర్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కమల్‌ హాసన్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు