బాలిక కిడ్నాప్‌?

10 Dec, 2019 03:19 IST|Sakshi

డయల్‌ 100కు కాల్‌..

కాపాడిన పోలీసులు

హసన్‌పర్తి: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్‌ నుంచి కిడ్నాప్‌కు గురైన ఓ బాలికను హసన్‌పర్తి పోలీసులు సోమవారం కాపాడినట్లు తెలిసింది. భీమదేవరపల్లికి చెందిన ఇంటర్మీడియెట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని రెండు రోజుల క్రితం ఎల్కతుర్తిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్నేహతురాలిని కలవడానికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె బస్సు కోసం వేచి చూస్తుండగా హసన్‌ పర్తి మండలం అన్నాసాగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చి వివిధ ప్రాంతాల్లో తిప్పాడు.

రాత్రి కావడంతో ఆ బాలికను హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో ఉంటున్న తన సోదరి వద్దకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఉదయం ఆ బాలిక తనను కిడ్నాప్‌ చేశారని డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు బాధితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుడి ఫోన్‌ ఆధారంగా హసన్‌పర్తి మండలం అన్నాసాగరంగా గుర్తించి గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా