ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు ఎన్‌ఐఏ షాక్‌

20 Nov, 2023 19:27 IST|Sakshi

టాటా యాజమాన్యంలోని  విమానయాన సంస్థ ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) షాకిచ్చింది. అతడిపై పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు పెట్టినట్టు వెల్లడించింది.  

సిక్స్‌ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్‌ గురుపత్వంత్ సింగ్ పన్నూన్  నవంబర్ 4 న ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. సిక్కులు ఎవరూ నవంబరు 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఒకవేళ అలా ఎవరైనా ప్రయాణిస్తే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించాడు. మొత్తం 37 సెకెన్ల  వీడియోలో అదే రోజు నవంబర్ 19న వరల్డ్  కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటూ  బెదిరించడం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో  కలకలం రేపాయి. దీంతో హై అలర్ట్ జారీ చేసిన ఇండియా, కెనడాతోపాటు  ఎయిరిండియా పయనిచంఏ  ప్రయాణించే కొన్ని ఇతర దేశాలలో భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి.

2019లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ అతనిపై  తొలి కేసు నమోదైంది. అప్పటికీ అతడు ఎన్‌ఐఏ దృష్టిలో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ,చండీగఢ్‌లోని అమృత్‌సర్‌లో ఇల్లు , కొంతభూమిని జప్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఎన్‌ఐఏ  ప్రత్యేక కోర్టు  పన్నన్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న అతన్ని "ప్రకటిత నేరస్థుడిగా" ప్రకటించింది. భారత్-కెనడా  సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేరు ప్రతిచోటా మారుమోగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు