అడ్డంగా బుక్కయ్యారు..

29 Dec, 2017 09:36 IST|Sakshi
నిందితులు విజయ్, వాసు

అమ్మమ్మ గొలుసు చోరీకి యత్నం

ఇద్దరు మనవళ్ల అరెస్ట్‌

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌: యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌కు చెంది న విజయ్‌ డిగ్రీ ఫెయిల్‌ అయ్యాడు. వరుసకు సోద రుడైన వాసు పదో తరగతి ఫెయిల్‌ అయ్యాడు. ఇద్ద రూ హైటెక్‌ సిటీ రోడ్డులో రాత్రి పూట ఛాయ్‌బండి నడిపించి ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.50 వేల వరకు ఖర్చవుతాయని అంచనా వేసిన ఇద్దరూ పక్కా ప్లాన్‌ వేశాడు. తన ఇంటికి వచ్చిన అమ్మమ్మ మెడలోనుంచి గొలుసు తస్కరించి అమ్మగా వచ్చిన డబ్బుతో ఛాయ్‌ బండి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే స్నాచింగ్‌చేసే క్రమంలో చేసిన చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటు చేసుకున్న ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే..యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లోని పోలీస్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న ప్రమీల కుమారుడు విజయ్‌ ఆవారాగా తిరుగుతున్నాడు. ఇటీవల అతని అమ్మమ్మ వెంకటమ్మ ఊరి నుంచి వచ్చింది. ఆమె మెడలో గొలుసు తస్కరించాలని అన్న వాసుతో కలిసి పథకం వేశాడు. బుధవారం ఉదయం వాసు ముసుగు తో వచ్చి గొలుసు తెంచుకొని పరారయ్యాడు. పోలీసు లు నిందితులపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. స్నాచింగ్‌ చేసింది తానేనని ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించారు. అందుకు అమ్మమ్మ గొలుసునే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు