భయానకం: ఆ గది నిండా తలలు, మొండాలు

31 Oct, 2017 11:05 IST|Sakshi

టోక్యో : సీరియల్‌ కిల్లర్‌ ఉదంతం వెలుగు చూడటంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పండింది. టోక్యోకు నైరుతి ప్రాంతంలో ఉన్న జమా పట్టణంలో ఓ అపార్ట్‌మెంట్‌లో తల, మొండాలే వేర్వేరుగా ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

జమాలోని ఆ అపార్ట్‌మెంట్‌ లో గత కొంత కాలంగా ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. అయితే గత పది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం హచియోజి ప్రాంతానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయిందంటూ నమోదు కాగా, ఆ కేసు విచారణలో లభించిన ఆధారాలతో టోక్యో పోలీసులు సోమవారం సదరు మహిళ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవటంతో తాళాలు పగలకొట్టి సోదాలు చేశారు.

ఓ కూలర్‌ బాక్స్‌ లో ఉన్న రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. లోపలికి వెళ్లిన పోలీసులకు భయానక దృశ్యాలు దర్శనమిచ్చాయి. అక్కడ కొన్ని కూలర్‌ బాక్స్‌లలో తల, మొండాలు వేర్వేరుగా ఉన్న కొన్ని మృతదేహాలు వారి కంటపడ్డాయి. దీంతో వాటిని స్వాధీపరుచుకున్న పోలీసులు.. అవి ఎవరివో గుర్తించే పనిలో పడ్డారు. మొత్తం 9 మృతదేహాలు లభ్యమైనట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ఆ గదిలో నివసించే మహిళ, తకహిరో అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు మైనిచి షింబన్‌ అనే పత్రిక కథనం ప్రచురింది. అయితే మిస్సయిన యువతి సూసైడ్‌ నోట్‌ రాసి వెళ్లటం.. చివరిసారిగా ఓ రైల్వే స్టేషన్‌లో కనిపించిన ఫుటేజీలు దర్శనమివ్వటంతో... ఈ కేసులో వేరే కోణాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారని సదరు కథనం తెలిపింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు