నాన్న వద్దు.. ప్రేమికుడే ముద్దు

5 May, 2019 06:57 IST|Sakshi
పి.జ్యోత్స్నతండ్రితో మాట్లాడుతున్న  ఏఎస్‌ఐ రాధాకృష్ణారెడ్డి

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని పట్టు 

ఇంటికి రానంటే రానంటూ మొండికేసిన విద్యార్థిని

నూజివీడు : ‘నేను నా తండ్రితో పాటు ఇంటికెళ్లను.. నాకు వేరే పెళ్లి చేస్తారు. నేను ప్రేమించిన యువకుడి దగ్గరికే వెళ్తా.. ’ అంటూ నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థిని మొండికేసింది. ట్రిపుల్‌ ఐటీకి సెలవులు కావడంతో కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రి వెంట తాను వెళ్లేది లేదని భీష్మించుకూర్చుంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనతో ఏం చేయాలో పాలుపోక ట్రిపుల్‌ ఐటీ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం పూర్తిచేసిన పి.జ్యోత్స్న స్వగ్రామం గుంటూరు జిల్లా వెల్లటూరు.

ఏడాది కిందట ఇంటర్న్‌షిప్‌నకు వెళ్లిన సమయంలో విజయవాడలో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మోహనమురళీతో పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. ఎంబీఏ చదివిన అతను ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు కుమార్తెను మందలించారు కూడా. ఈ నేపథ్యంలో శనివారంతో పరీక్షలు పూర్తవుతున్నందున కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి శుక్రవారం సాయంత్రమే ట్రిపుల్‌ ఐటీకి వచ్చాడు.

ట్రిపుల్‌ ఐటీ అధికారులు కూడా ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నూజివీడు సీఐ మిద్దే గీతారామకృష్ణ సైతం వెళ్లి ఆ అమ్మాయికి కౌన్సెలింగ్‌ చేసినా తండ్రి వెంట వెళ్లేందుకు ససేమిరా అనడంతో ఏమి చేయాలో తెలియనిస్థితిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు