ఇంటర్‌ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!

12 Mar, 2019 10:17 IST|Sakshi

సాక్షి, నల్గొండ : పట్టణంలోని పాలిటెక్నిక్ కలశాల వద్ద ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిపై దుండగులు బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని గొంతు కోసి పరారయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థిని మాచర్ల తరుణ్ కుమార్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడడంతో తరుణ్‌ రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తరుణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెదిన తరుణ్‌ స్థానిక ప్రగతి కలశాలలో ఇంటర్ సెకండియర్‌ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం స్నేహితుడని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిన విద్యార్థి  హాస్టల్ నుంచి బయటికి వచ్చినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు