ఐపీఎల్‌లో బ్లాక్‌ షీప్‌

14 May, 2019 09:34 IST|Sakshi

టికెట్‌లు అమ్ముతున్న 93 మంది పట్టివేత

ఐదుగురు ఈవ్‌టీజర్లు సైతం అరెస్టు

ఫైనల్‌ మ్యాచ్‌ రోజూ రెచ్చిపోయిన పిక్‌పాకెటర్లు

సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) మ్యాచ్‌ల్లో బ్లాక్‌ టికెట్ల దందా జోరుగా సాగింది. మే 12న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తారాస్థాయికి చేరింది. మార్చి 29 నుంచి మే 12 వరకు ఉప్పల్‌ స్టేడియం వేదికగా సాగిన మ్యాచ్‌లకు టికెట్లను బ్లాక్‌లో అమ్మిన 93 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 304 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

మ్యాచ్‌లు వీక్షించేందుకు  వచ్చిన యు వతులను వేధిస్తున్న ఐదుగురు ఈవ్‌టీజర్లను మఫ్టీలో ఉన్న రాచకొండ షీ బృందాలు పట్టుకున్నాయి. అలాగే క్రికెట్‌ అభిమానుల నుంచి డబ్బులు, బంగారు ఆభరణాలు కొట్టేసిన ఐదు గురు దొంగలను కూడా అదుపులోకి తీసుకున్నా రు. మద్యం తాగి ఇతరులకు ఇబ్బందులు కలిగించిన న్యూసెన్స్‌ కేసులు కూడా పరిమిత సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరి అక్రిడేషన్‌ కార్డును మరొకరు వాడిన కేసులో ఒకరిపై 420 కేసు కూడా నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 116 కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఆయా పెట్టీ కేసులు మినహా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని, భద్రతపరంగా పోలీసులు బాగా పనిచేశారని రాచకొండ పోలీ సు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహనదారుల కు పార్కింగ్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, క్రికెట్‌ అభిమానుల కోసం ఆర్టీసీ, మెట్రోలు ప్రత్యేక సేవలు అందించడంతో ఎవరి ఇళ్లకు వారు సక్రమంగా చేరుకోగలిగారన్నారు. 

మరిన్ని వార్తలు