ముక్కలు చేసి.. సూట్‌కేస్‌లో పెట్టి

5 May, 2018 15:50 IST|Sakshi

జైపూర్‌ : డబ్బు కోసం స్నేహితున్ని చంపి ముక్కలుగా చేసి సూట్‌కేస్‌లో పెట్టి రోడ్డు మీద పడేశారు. ఈ దారుణమైన సంఘటన జైపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన దుష్యంత్‌ శర్మ(29)కు సోషల్‌మీడియా ద్వారా బజాజ్‌ నగర్‌లో ఉండే ప్రియా సేథ్‌(27) అనే యువతి పరిచయం అయ్యింది. మే 2న ప్రియా సేథ్‌ దుష్యంత్‌ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ప్రియ ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లిన దుష్యంత్‌ను తనకు పది లక్షల రూపాయల డబ్బు కావాలని డిమాండ్‌ చేసింది. అందుకు దుష్యంత్‌ ఒప్పుకోకపోవడంతో, అతనిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది.

అంతేకాక అప్పటికే తన ఇంటికి పిలిపించుకున్న మరో ఇద్దరు స్నేహితులు దీక్షంత్‌ కుమార్‌(27), లక్ష్య వాలియా(25) సాయంతో ప్రియ దుష్యంత్‌ను బంధించింది. అనంతరం దుష్యంత్‌ తండ్రికి ఫోన్‌ చేసి మీ కుమారున్ని విడుదల చేయాలంటే పదిలక్షల రూపాయలు తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అందుకు దుష్యంత్‌ తండ్రి తన దగ్గర అంత సొమ్ము లేదని, మూడు లక్షల రూపాయలను దుష్యంత్‌ బ్యాంకు అకౌంట్‌లో జమచేశాడు. నిందితులు దుష్యంత్‌ ఏటీఎమ్‌ నుంచి 20 వేల రూపాయలను డ్రా చేశారు. అనంతరం దుష్యంత్‌ బతికి ఉంటే తమకు అపాయమని భావించి అతన్ని చంపి ముక్కలు చేసి, సూటికేస్‌లో పెట్టి రోడ్డు పక్కన పడేసినట్లు జెత్వార్‌ ఏసీపీ ఆస్‌ మహ్మద్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు