కాన్పూర్ ఎన్‌కౌంటర్‌: శవపరీక్షలో విస్తుగొలిపే..

5 Jul, 2020 20:18 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వికాస్‌ దూబే అనే గ్యాంగ్‌స్టర్‌ అతడిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీతో సహా మొత్తం 8 మంది పోలీసులు మృతిచెందారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి శవపరీక్ష నివేదికల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఎనిమిది మంది పోలీసుల శవపరీక్ష నివేదికలు శనివారం విడుదలయ్యాయి.  చనిపోవడానికి ముందు పోలీసులను అతి క్రూరంగా హింసించబడ్డారని వైద్యులు ఆ నివేదికలో పేర్కొన్నారు. బిల్హౌర్‌ సర్కిల్‌ ఆఫీసర్‌(సీఐ) దేవేంద్ర మిశ్రా తలను వికాస్‌ దూబే మనుషులు గొడ్డలితో నరికినట్లు శవపరీక్షలో వెల్లడైంది. అతని కాలు కత్తిరించబడి, శరీరం తీవ్రంగా గాయాలపాలైనట్లు తేలింది. అదే విధంగా పోలీసుల వద్ద నుంచే దూబే అనుచరులు తుపాకులు లాక్కొని మరీ కాల్పులు జరిపినట్లుగా తెలిసింది. (యూపీ గ్యాంగ్‌స్టర్‌ అనుచరుడి అరెస్టు)

కానిస్టేబుల్స్‌ బబ్లు, రాహుల్‌, సుల్తాన్‌ బుల్లెట్‌ గాయాలతో మరణించినట్లు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు తెలిపారు. అదే విధంగా కానిస్టేబుల్‌ జితేంద్ర పాల్కుపై ఎకే-47తో కాల్పులు జరిగినట్లు చెప్పారు. మరణించిన పోలీసుల భుజాలపై తీవ్రమైన గాయాలు ఉండటంతో వైద్యులు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నివేదికలపై కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ శనివారం మాట్లాడుతూ.. దుబే గ్యాంగ్‌ మనుషులు మావోయిస్టులు దాడి చేసే విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. ఇక దుబే గ్యాంగ్‌లో పని చేసే దయా శంకర్‌ అగ్నిహోత్రిని కాన్పూర్‌ నగరం సమీపంలోని​ కల్యాణ్‌పూర్‌లో శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(వికాస్‌ దూబేకు సాయం.. పోలీస్‌ అధికారిపై వేటు)

చదవండి: గ్యాంగ్‌స్టర్‌ ఇల్లు కూల్చివేత, సరళాదేవీ విచారం

మరిన్ని వార్తలు