అప్పుల బాధతో వ్యాపారి బలవన్మరణం

7 Jun, 2018 14:45 IST|Sakshi
మహిపాల్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు 

సంగెం వరంగల్‌ : అప్పుల బాధ భరించలేక మనోవేదనకు గురైన ఓ వ్యాపారి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సంగెం మండలంలో బుధవారం జరిగింది. బంధువులు, పోలీసుల క«థనం ప్రకారం.. దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన పట్టెం మహిపాల్‌(35)కు సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన కవితతో పదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన తర్వాత సంగెం మండల కేంద్రంలో ఉంటూ హోమ్‌ నీడ్స్‌ గృహోపకరణాలు మిక్సీలు, కుక్కర్లు వంటివాటిని వాయిదాల పద్ధతిలో ఇస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

నాలుగేళ్ల క్రితం అత్తగారి ఊరైన మొండ్రాయిలో ఇంటి నిర్మాణం చేసుకుని వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంతోపాటు ఇంటి కోసం అప్పు చే శాడు. వాయిదాల పద్ధతిలో వస్తువులు ఇచ్చిన చోట వసూళ్లు సరిగా కాకపోవడంతో అప్పులు ఎ లా తీర్చాలంటూ మహిపాల్‌ భార్య కవితకు చెప్పుకుని మదనపడుతుండేవాడు. క్రమక్రమంగా తీర్చుదామని భార్య ధైర్యం చెప్పుతుండేది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోజనాలు చేసిన తర్వాత ఇంట్లో నిద్రించారు.

అర్ధరాత్రి భార్య కవి తకు మెలకువ వచ్చి చూడగా భర్త కనిపించలేదు. బయటికి వచ్చి చూడగా చీరతో మెట్ల ఇనుప సలా కులకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపి ంచాడు. కవిత ఏడుస్తూ  కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మహిపాల్‌ మృతిచెంది ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారులు విష్ణువర్ధన్, ప్రణయ్‌ ఉన్నారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌.దీపక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు