ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై వేధింపుల కేసు

2 Feb, 2019 13:01 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, ఏబీసీడీ ఫేం సల్మాన్‌ యూసఫ్‌ ఖాన్‌పై వేధింపుల కేసు నమోదైంది. సినిమాల్లో అవకాశాలిప్పిస్తానని, తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ డ్యాన్సర్‌ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న ముంబై, ఒషివరా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతేడాది ఆగస్టులో లండన్‌లో ఉన్నప్పుడు డ్యాన్సర్‌గా అవకాశాల కోసం తొలిసారి యూసఫ్‌ ఖాన్‌ మేనేజర్‌ను సంప్రదించానని, అనంతరం ముంబైలోని ఓ కాఫీషాప్‌లో యూసఫ్‌ ఖాన్‌ను కలిసానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అతను బాలీవుడ్‌ పార్క్‌లో డ్యాన్సర్‌గా అవకాశం కల్పిస్తానని చెప్పి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తాకరాని చోట చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టాడని ఆరోపించింది. అనంతరం ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తానన్నాడని, తన చర్యలను తిరస్కరిస్తే.. ఇది బాలీవుడ్‌లో కామన్‌ అంటూ మాట్లాడాడని చెప్పుకొచ్చింది.

దుబాయ్‌లో హోటల్‌కు రమ్మన్నాడని, అతని కజిన్‌ బ్రదర్‌తో కలిసి వేధింపులకు గురిచేశాడని తెలిపింది. సల్మాన్‌, అతని టీమ్‌ గతకొద్ది రోజులుగా తనను తీవ్రంగా టార్చర్‌ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. ఫేమస్‌ డ్యాన్స్‌ షో ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’ విన్నర్‌ అయిన సల్మాన్‌ బాలీవుడ్‌ హిట్‌ సినిమాలకు కొరియోగ్రఫర్‌గా పనిచేశారు. ఏబీసీడీ, రక్త చరిత్ర, వాంటెడ్‌ సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ కూడా చేశాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు