బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ తండ్రిపై అత్యాచారం కేసు

21 May, 2020 15:41 IST|Sakshi

పంజాబీ యాక్టర్‌, సింగర్‌, బిగ్‌బాస్‌ 13 ఫైనలిస్ట్‌ షెహనాజ్‌ గిల్‌ తండ్రి సంతోష్‌ సింగ్‌ సుఖ్‌పై అత్యాచారం కేసు నమోదయ్యింది. నలభై ఏళ్ల మహిళ ఒకరు సంతోష్‌ సింగ్‌ కారులో తనను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే షెహనాజ్‌ సోదరుడు షెహబాజ్‌ బదేషా ఈ ఆరోపణలను కొట్టి పారేశాడు. ‘నా తండ్రి మీద పంజాబ్‌ పోలీసులు కేసు నమోదు చేశాడు. ఇవన్ని తప్పుడు వార్తలు. నా తండ్రిని కించపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది. ఇలాంటి వార్తలు విన్నప్పుడు మాకు బాధ కల్గుతుంది. కానీ మా వైపు ఎలాంటి తప్పు లేదు. సదరు మహిళ సంఘటన జరిగిందంటూ ఫిర్యాదు చేసిన ప్రాంతంలో సీసీటీవీ కెమరాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే నిజం ఏంటో తెలుస్తుంది. ఆమె ఏ ఉద్దేశంతో నా తండ్రిపై ఫిర్యాదు చేసిందో తెలియదు’ అన్నాడు.(అత్యాచారానికి ప్రయత్నించాడు: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు