సుమలత ఆది నుంచి కన్నింగే! 

10 Nov, 2019 11:04 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : మైనర్‌పై లైంగిక దాడికి  పాల్పడిందన్న ఫిర్యాదుతో సుమలతను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులకు రోజుకో ట్విస్టు ఎదురవుతోంది. ఆమె లైంగిక దాడికి వినియోగించిన కృత్రిమ పరికరాన్ని, పురుషుడిలా ఆమె ధరించే దుస్తులు, విగ్‌ను పోలీసులు సీజ్‌ చేసిన సంగతి విదితమే. ఈ కేసులో మగ వాడిలా మైనర్‌ను పరిచయం చేసుకుంటూ వినియోగించిన సాయి కిరణ్‌ పేరును కూడా ఆమె   వ్యూహాత్మకంగా వాడుకున్నట్లు గుర్తించారు. తొలుత సాయి కిరణ్‌ అనే వ్యక్తే లేడని భావించిన పోలీసులు.. ఆ తర్వాత సాయి కిరణ్‌ అనే వ్యక్తి ఉన్నాడని, అయితే అతను ఎనిమిది నెలల క్రితమే సుమలత ఇంట్లో డబ్బులు తీసుకుని పరారైనట్లు ప్రాథమికంగా గుర్తించడం కొసమెరుపు.

వంశీకృష్ణ పాత్రపై ప్రత్యేక దర్యాప్తు
బాధితురాలిని విచారించిన పోలీసులకు ఆమె చెప్పిన కథనం ఇలా ఉంది. తనకు సాయికిరణ్‌ కూల్‌డ్రింక్‌ ఇచ్చాడని, తాగిన తర్వాత తనకు రెండు గంటలకు పైగా సృహ లేదని, ఆ క్రమంలో తనపై సుమలత లైంగిక దాడికి  పాల్పడిందని పేర్కొంటోంది. తాజాగా ఆమె పనిచేసిన ప్రాంతాల్లో విచారిస్తే సుమలత స్వగ్రామంలో తొలుత మగరాయుడిలా సంచరిస్తూ ఆడపిల్లలను బైకులపై తిప్పుతుంటే గొడవ కూడా జరగడం, దీంతో మనస్తాపం చెందిన సుమలత అదృశ్యం కావడం, దీనిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా అందిందంటున్నారు.

రెండు రోజుల తర్వాత ఆమె తిరిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కొండపిలో ఆర్‌ఎంపీగా వైద్య సేవలు అందిస్తున్న ఏడుకొండలుతో పాటు అక్కడే సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్న వంశీకృష్ణతోనూ సుమలతకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఏడుకొండలుతో వివాహం జరిగింది. అయితే క్లినిక్‌కు సమీపంలోనే ఉన్న వంశీకృష్ణతో సైతం ఆమె ఎంతగానో పరిచయం పెంచుకుందంటే సుమలత వినియోగింన నాలుగు సిమ్‌కార్డులు వంశీకృష్ణ పేరు మీదే రిజిస్టరై ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.

ఒకరి సిమ్‌ కార్డును మరొకరు వినియోగిస్తే ఏదైనా నేరం జరిగితే అతను నేరస్తుడుగా మారతాడనేది సికార్డులు విక్రయించే వారికే కాదు, సెల్‌ఫోన్‌ వినియోగించేవారికి తెలిసిన సంగతి విదితమే. మరి అటువంటప్పుడు వంశీకృష్ణ ఏం ఆశించి సుమలతకు తన పేరు మీద సిమ్‌ కార్డులు అందించాడనేది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ గత చరిత్రను తిరగదోడే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కోణంలోనే వంశీకృష్ణ పలుమార్లు స్థానిక మారుతీనగర్‌లోని సుమ లత నివాసానికి కూడా వచ్చి వెళ్తుండేవాడని గుర్తించారు. వంశీకృష్ణకు సంబంధించి వినిపిస్తున్న ప్రచారంలో సైతం నిగ్గు తేల్చుకునేందుకు పోలీసులు దృష్టి సారించారు.

ఎవరీ సాయికిరణ్‌?
కిలేడీ సుమలత వ్యవహారం ఆది నుంచీ కన్నింగ్‌ నేచర్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఒంగోలుకు వచ్చిన సుమలత దుర్గా హోటల్‌లో పనిచేసేది. ఆమెతో పాటు సాయికిరణ్, రమణయ్య అనే వ్యక్తులు కూడా పనిచేసే వారు. సాయికిరణ్‌ కేరాఫ్‌ ఫుట్‌పాత్‌ అని తెలిసింది. ఈ క్రమంలో అతను సుమలతతో పాటు ఆమె ఇంట్లోనే ఉండేవాడు. 8 నెలలక్రితం అతను సుమలత నివాసంలో కొంత డబ్బు తీసుకుని పరారయ్యాడు. ఈ విషయాన్ని అతనితో పాటు పనిచేసిన రమణయ్య స్ఫష్టం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆమె వంశీకృష్ణ సిమ్‌ కార్డులు పొందిన మాదిరిగానే పరారైన సాయికిరణ్‌ పాత్రను కూడా సృష్టించి మగ వేషంలో అకృత్యాలకు పాల్పడుతుండేదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇదే నిజమైతే బాలికను ట్రాప్‌ చేసిన కొండపిలో రెండు నెలల క్రితమే వారు చేరినట్లు పోలీసులు తెలిపారు. మరి దుర్గా హోటల్‌లో 8 నెలల క్రితం నుంచే పనిచేసేటప్పుడు ఆమె ఒంగోలులో ఎక్కడ నివాసం ఉందనేది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో సుమలత నివాసంలో ఎనిమిది నెలల క్రితం సాయికిరణ్‌ ఉన్న దృష్ట్యా అతన్ని కూడా విచారిస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 
(చదవండి : షీ మ్యాన్‌ ! ఆమే.. అతడు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళను అపహరించి ఆపై లైంగిక దాడి, దోపిడీ..

కొండవీడు కొండపై మహిళ దారుణ హత్య 

కి'లేడి'లు గర్భిణిలుగా నటించి ఆపై..

ప్రియుడి భార్యపై దాడిచేసిన రేష్మా

పెళ్లికి ముందే అనుమానించి.. ఆపై వేధింపులు!

ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌

మరదలిని హత్య చేసిన వదిన

ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తా 

లైంగికదాడి.. హత్య!

పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

తప్పిపోయిన అమెరికా టూరిస్ట్‌​, తిరిగి గోవాలో..

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

నవ వధువు..ఇవి వద్దు అంటూ వేడుకుంది..

ఆ విధికి కన్నుకుట్టిందేమో..

భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం

రంగుల వల.. చెదిరే కల

అసలు సూత్రధారి ఎక్కడ?

కిలాడి లేడి; గవర్నర్‌ సంతకం నుంచి మొదలుపెట్టి..

సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..

పౌడర్‌ డబ్బాపై పడి చిన్నారి మృతి 

నకిలీ క్యాట్రిడ్జెస్‌ ప్యాక్‌ చేసి అమ్మేస్తాడు..!

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..

‘కిలేడీ’ కేసులో మరో కొత్తకోణం

నకిలీ నగలు తాకట్టు అక్కాచెల్లెలు అరెస్టు

14 మందిని తన వలలో వేసుకుని..

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య?

ఘాట్‌ రోడ్డులో ఘోరం:10మంది దుర్మరణం

ముహూర్తం చూసుకుని..దంపతుల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కిలాడి స్టార్‌కు గాయాలు

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌

బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం