నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం!

14 Nov, 2023 08:51 IST|Sakshi
శ్రీరాముల మోహన్‌ (ఫైల్)

సాక్షి, కరీంనగర్: మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య, సీఐ రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాముల మోహన్‌(33) తన నాయీబ్రాహ్మణ వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా విపరీతమైన వెన్ను నొప్పి వస్తుండటంతో ఆస్పత్రిలో చూపించుకొని, మందులు వాడుతున్నాడు. అయినా నొప్పి తగ్గడం లేదు. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా అతని భార్య రజని ఖాజీపేటలోని తన తల్లిగారింటికి వెళ్ళింది. మోహన్‌ సోమవారం ఉదయం ఇంటి ఆవరణలో గల మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
ఇవి కూడా చదవండి: దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..!

మరిన్ని వార్తలు