కెమెరా బుక్‌ చేస్తే.. రాళ్లొచ్చాయ్‌!

16 Apr, 2019 07:36 IST|Sakshi
పార్సిల్‌లో వచ్చిన నల్లని రాళ్లను  చూపిస్తున్న బాధితుడు యాదిసాగర్‌

ఫ్లిప్‌కార్డ్‌లో రూ.48,990 కోల్పోయిన బాధితుడు 

వనపర్తి: ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎప్పటికైనా ప్రమాదమని మరోసారి రుజువైంది. జిల్లాకేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్‌ కాలనీకి చెందిన చీర్ల యాదిసాగర్‌ ఈ నెల 11వ తేదీన జీఎస్టీతో కలిపి రూ.48,990 విలువ గల కెనాన్‌ కంపెనీ డిజిటల్‌ కెమెరాను ఫ్లిప్‌కార్డు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కొనుగోలు చేశాడు. అయితే సోమవారం ప్లిప్‌కార్డు నుం చి ఇన్‌స్టాకార్డు సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా యాదిసాగర్‌కు ఓ పార్సిల్‌ వచ్చింది. డబ్బు చెల్లించి పార్సిల్‌ను ఇంటికి తెచ్చి తెరిచి చూస్తే.. అందులో రెండు నల్లని రాళ్లు కనిపించాయి.

ఒక్కసారిగా నివ్వెరపోయిన బాధితుడు కొరియర్‌ను ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని చెప్పేశాడు. దీంతో బాధితుడు రాళ్లతో వచ్చిన ఫ్లిప్‌కార్డు  బాక్స్‌తో జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేస్తాం కాని.. íఫ్లిప్‌కార్డు సంస్థ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి విషయం చెప్పాలని సూచించారని బాధితుడు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఎక్కువ విలువగల వస్తువులు వచ్చిప్పుడే.. పార్సిల్‌లో రాళ్లు, మట్టిపెల్లలు వస్తుంటాయి. ఫ్లిప్‌కార్డు సంస్థ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే.. మరో వారం రోజుల్లో పొరపాటు ఎక్కడ జరిగిందో విచారణ చేస్తామన్నట్లు బాధితుడు వివరించారు. 

మరిన్ని వార్తలు