బాస్‌ వేధిస్తోందని...

29 May, 2018 15:09 IST|Sakshi
వీడియోలోని దృశ్యాల ఆధారంగా...

ఆగ్రా: బాస్‌ వేధిస్తుందన్న కారణంతో ఓ ఉద్యోగి చేసిన పని అతన్ని చిక్కుల్లో పడేసింది. విధుల నుంచి సస్పెండ్‌ కావటంతోపాటు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... అలీఘడ్‌ జిల్లా కోర్టులో వికాస్‌ గుప్తా అనే వ్యక్తి ఓ మహిళా సివిల్‌ జడ్జి దగ్గర ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అతని వ్యవహారశైలిలో మార్పును గమనించిన ఆమె.. తన ఛాంబర్‌లో సీసీటీవీ ఫుటేజీని ఉంచారు. ఓరోజు ఆమె నీళ్లు అడగ్గా, గ్లాసులో ఉమ్మేసి మరీ ఆమెకు నీటిని అందించాడు. అదంతా సీసీటీవీలో రికార్డయ్యింది.

ఫుటేజీని చూసిన ఆమె ఈ విషయంపై సీనియర్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతవారం ఈ ఘటన చోటు చేసుకోగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనపై ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేత ఉమా శంకర్‌ యాదవ్‌ స్పందించారు. ‘గుప్తా చేసింది ముమ్మాటికీ తప్పే. అయితే గత రెండు నెలలుగా అతనిపై వేధింపులు ఎక్కువయ్యాని తెలిసింది. అప్పటి నుంచి అతని మానసిక స్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బహుశా అందుకే ఇలా చేసి ఉంటాడేమో’ అని యాదవ్‌ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి పీకే సింగ్‌ ఓ సీనియర్‌ అధికారితో విచారణకు ఆదేశించారు. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని జడ్జి ఆ అధికారిని ఆదేశించారు.

మరిన్ని వార్తలు