రాహుల్‌ గాంధీ ఓ నిపా వైరస్‌

29 May, 2018 15:14 IST|Sakshi
రాహుల్ గాంధీ, హరియాణ మంత్రి అనిల్‌ విజ్‌ (ఫైల్‌ ఫొటో)

బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

చండీగఢ్‌ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిపా వైరస్‌తో సమానమని హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం ఆయన చేసిన ఈ ట్వీట్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ శ్రేణులు తిప్పికొడుతున్నారు.  ‘రాహుల్‌ గాంధీ నిపా వైరస్‌తో సమానం. ఏ రాజకీయ పార్టీ అతనితో కలసినా నాశనం కావల్సిందే.’  అని అనిల్‌ విజ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ బీజేపీ మంత్రి ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. భగత్‌ సింగ్‌, లాలా లజపతిరాయ్‌లు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారని, కానీ నెహ్రు, మహాత్మ గాంధీలు కనీసం ఓ లాఠి దెబ్బకూడ తినలేదని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పట్టం కట్టినప్పుడు సైతం అనిల్‌ విజ్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పక్షులు తిని పడేసే పండ్లు వల్ల వచ్చే ఈ వైరస్‌ తొలిసారి 1998 మలేషియాలో గుర్తించారు.

>
మరిన్ని వార్తలు