సెల్ఫీ పిచ్చితో బుక్కయ్యాడు..

3 Mar, 2018 11:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, టీ.నగర్‌: సోషల్‌ మీడియా నేటి యువతపై బాగానే ప్రభావం చూపుతుంది. ఓ యువకుడు సైనిక దస్తులు ధరించి, చేతిలో తుపాకీతో దిగిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ యువకుని వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా, మేచ్చేరికి చెందిన ప్రభు(35) ట్రావెల్స్‌ నడుపుతున్నాడు.

ఇతను కొన్ని రోజుల కిందట తన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో చేతిలో నాటు తుపాకీతో దిగిన ఫొటోలను పోస్టు చేశాడు. మరో ఫొటోలో సేనిక దుస్తులు ధరించి, ఎకే-47 తుపాకీతో కనిపించాడు. అంతేకాక తన ఫోన్‌ నంబర్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలను చూసిన అటవీశాఖ అధికారులు మేచ్చేరికి వెళ్లి ప్రభును అదుపులోకి తీసుకున్నారు. 

అధికారుల విచారణలో ప్రభు కొన్ని విషయాలను వెల్లడించారు. బోర్‌వెల్‌ సంస్థలో మేనేజర్‌గా ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బస చేశానన్నాడు. ఆ సమయంలో అక్కడున్న స్నేహితుడి వద్ద తుపాకీ తీసుకుని ఫొటోకు ఫోజిచ్చినట్లు తెలిపాడు. అలాగే మరో స్నేహితుని వద్ద సైనిక దుస్తులు ధరించి ఫొటో దిగినట్లు తెలిపాడు. ఈ ఫొటోలు తీసుకుని రెండేళ్లవున్నట్లు ప్రభు పేర్కొన్నాడు.  అటవీ శాఖ అధికారులు శుక్రవారం అతన్ని మేచ్చేరి పోలీసులకు అప్పగించారు. ప్రభుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు