సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

28 Jul, 2019 11:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఫార్మసీ విద్యార్థి సోనీ లో కిడ్నాప్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నల్లమల ఫారెస్ట్‌ ఏరియాలో కిడ్నాపర్‌ రవిశంకర్‌ ఆనవాళ్లను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆంధ్ర పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. మరోవైపు కిడ్నాప్‌ వ్యవహారంలోనూ కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం. ఆ ఆధారాల ప్రకారం సోని కిడ్నాప్‌లో బంధువుల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్‌ రవిశంకర్‌ను పట్టుకునేందుకు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ చుట్టూ తిరుగుతున్న దర్యాప్తు
నగరంలో జరిగిన ఫార్మసీ విద్యార్థి సోనీ కిడ్నాప్ స్టోరీ ఇప్పుడు ఏపీ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో కిడ్నాపర్ ఆనవాళ్లను పోలీసులు పసిగట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో బృందాలుగా విడిపోయి ఆంధ్రా- తమిళనాడు, ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు . హైదరాబాద్‌లో కిడ్నాప్‌ అయిన ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ ఇంకా తెలియలేదు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్‌ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో తండ్రిని నమ్మించి కూతురు సోనీని తీసుకువెళ్లిన కిడ్నాపర్ రవిశంకర్‌ ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన వాడుగా గుర్తించారు.

ఈజీ మనీకి అలవాటుపడ్డ రవిశంకర్‌ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దృష్టి మళ్లించి పనికానిచ్చేయటంలో దిట్ట. కంకిపాడు, పెనమలూరు, విజయవాడల్లో పలు దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. అలా జైలు నుంచి విడుదలై బయటకు రాగానే మళ్లీ దొంగతనాలు చేస్తూ కాలం గడిపేవాడు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఒక్క ఏపీలోనే 25 నేరాలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

ఓ కేసులో అరెస్టయిన రవిశంకర్ ఎస్కార్ట్ కళ్లుగప్పి ఏపీ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి హైదరాబాద్‌లో ప్రత్యక్షమై ఫార్మసీ విద్యార్థి సోనీని కిడ్నాప్ చేశాడు. దీంతో రవిశంకర్ స్వగ్రామం కృష్ణా జిల్లా దావులూరు కావడంతో.. ఆమెని ఏపీలో దాచి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల సహకారం తీసుకుని కేసును చేధించాలని తెలంగాణ పోలీసులు చూస్తున్నారు. ఇప్పటివరకు కేవలం దొంగతనాలు మాత్రమే చేసిన రవిశంకర్ ఇప్పుడు కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు? పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత ఏదైనా గ్యాంగ్‌తో చేతులు కలిపాడా? కిడ్నీ రాకెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? దుబాయికి అమ్మాయిలని అమ్మే ముఠాలో సభ్యుడయ్యాడా? ఇందుకోసమే తండ్రిని ట్రాప్‌ చేసి కూతురు సోనిని కిడ్నాప్‌ చేశాడా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవిశంకర్ కుటుంబ సభ్యులు మాత్రం అతడి నేర ప్రవృత్తితో విసుగెత్తిపోయారు. రవిశంకర్ తీరుతో తాము అవమానాలు ఎదుర్కోవలసి వస్తోందని వాపోతున్నారు. రవిశంకర్‌ను పట్టుకుని శిక్షించాలంటున్నారు.  రవిశంకర్ పై స్వగ్రామం దావులూరు వాసులు మండిపడుతున్నారు. సోనీని విడిచి పెట్టి పోలీసులకు లొంగిపోవాలని సూచిస్తున్నారు. కొడుకు పడుతున్న బాధలను చూసిఅయినా  రవిశంకర్ మారాలని కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

అప్పు తీర్చమని అడిగితే తల తెగింది..

విజయవాడ కరకట్ట మీద కారు బీభత్సం

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. ఇంటి నుంచి అదృశ్యమై..!

ఆస్పత్రిలో ఉరేసుకున్న వివాహిత

భార్య కాటికి.. భర్త పరారీ..

భార్యను పంపలేదని.. వదినను చంపిన మరిది

యువతితో ఎఫైర్‌ : ప్రియుడిని చావబాదారు

అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు

వైఎస్‌ జగన్‌ పీఏ నెంబర్‌ స్పూఫింగ్‌ చేసినందుకు అరెస్ట్‌

చారి.. జైలుకు పదకొండోసారి!

సానా సతీష్‌ అరెస్టు

నా కొడుకును చంపేయండి: చిట్టెమ్మ

భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రెండు బస్సులు దగ్ధం

సీఎంవో కార్యాలయ ఉద్యోగి అంటూ వసూళ్లు..

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

రా‘బంధువు’!

కొలిక్కి రాని కిడ్నాప్‌ కేసు..

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

ఓ బేబీ షాకిచ్చింది!

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?