రన్‌వేపై జారిన విమానం..తప్పిన పెను ప్రమాదం

2 Sep, 2018 18:34 IST|Sakshi
రన్‌వే నుంచి పక్కకు జారిపోయిన విమానం

ఖాట్మండు: నేపాల్‌ దేశీయ విమానం ఒకటి శనివారం రాత్రి రన్‌వేపై అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నేపాల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో 12 గంటల పాటు ఎయిర్‌పోర్టు సర్వీసులకు అంతరాయమేర్పడింది. ప్రమాదానికి గురైన విమానం, యేటి ఎయిర్‌లైన్స్‌కు చెందినది గుర్తించారు. రన్‌వేపై పగుళ్లు ఉండటంతో ఇటీవలే మరమ్మతులు కూడా చేశారు.  ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్‌ గంజ్‌ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.

గత మార్చి నెలలలో ఢాకా నుంచి ఖాట్మండు వెళ్తున్న యూఎస్‌-బంగ్లా ఎయిర్‌లైన్స్‌ విమానం, రన్‌వే నుంచి పక్కకు జారిపోయి ప్రమాదానికి గురవడంతో 51 మంది ప్రయాణికులు చనిపోయారు. అలాగే గత ఏప్రిల్లో 139 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియన్‌ ప్యాసింజర్‌ విమానం అదృష్టం కొద్దీ ప్రమాదం నుంచి బయటపడింది. టేక్‌ఆప్‌ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి జారి బురదలో కూరుకుపోవడంతో ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు