వివాహిత కిడ్నాప్, రోజూ గ్యాంగ్‌ రేప్‌!

14 Sep, 2019 14:15 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఎప్పటిలాగే మహిళలపై అత్యాచారాలు అధికంగా కొనసాగుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలను అరికడతామంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అత్యాచారాలు తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించడం లేదు. రాజస్థాన్‌లోని బెహరార్‌లో జూలై 20వ తేదీన ఓ 24వ తేదీన పెళ్లయినా ఓ యువతిని నలుగురు కిడ్నాప్‌ చేసి గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లారు. పర్సులో ఉన్న ఆరువేల రూపాయల నగదు, వంటిపైనున్న నగలను దోచుకున్నారట. ఆ తర్వాత మానం దోచుకునేందుకు ఎగబడ్డారట. ప్రతి రోజు ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి వరుసగా గ్యాంగ్‌ రేప్‌ చేసేవారట. రోజుకో చోటుకు తీసుకెళ్లి ఇలాగే అత్యాచారం చేస్తూ వచ్చారట. దాదాపు నెలన్నర రోజులు ఇలాగే మృగాళ్ల రాక్షసత్వానికి గురవవడంతో ఆమె గర్భవతి కూడా అయిందట. ఓ రోజు మత్తు నుంచి స్పృహలోకి వచ్చి చూస్తే తనను నిర్బంధించిన ఇంట్లో ఎవరూ లేరట. ‘మత్తులో ఉంది, పైగా తమ చేతుల్లో ఇంతగా నలిగాక ఎక్కడికి పోతుందిలే అన్న దుండగుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని ఆ యువతి పారిపోయి వచ్చింది’ అని బెహరార్‌ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

రెండు రోజుల క్రితం తమను ఆశ్రయించిన ఆ యువతి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకొని వైద్య చికిత్సల కోసం ఆస్పత్రికి పంపించామని చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులకు కబురు పెట్టామని కూడా సదరు పోలీసు అధికారి తెలిపారు. తనను కిడ్నాప్‌ చేసిన నలుగురు యువకుల పేర్లను అనిల్‌ కుమార్, దయానంద్, రామ్‌ అవతార్, రొహతాశ్‌లుగా ఆ యువతి వెల్లడించిందని పరారీలో ఉన్న ఆ నలుగురిని పట్టుకునేందుకు కృషి చేస్తున్నామని పోలీసు అధికారి చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా