వాద్రా, హుడాపై ఎఫ్‌ఐఆర్‌

2 Sep, 2018 04:46 IST|Sakshi

చండీగఢ్‌: గుర్గావ్‌లో అక్రమ భూ ఒప్పందాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ బావ రాబర్ట్‌ వాద్రా, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌సింగ్‌ హుడాలపై శనివారం పోలీసులు కేసు నమోదుచేశారు. సురేందర్‌ శర్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వాద్రా, హుడాతో పాటు డీఎల్‌ఎఫ్, ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ కంపెనీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు మనేసర్‌ డీసీపీ రాజేశ్‌ చెప్పారు.

గుర్గావ్‌లోని 4 గ్రామాల్లో హౌసింగ్‌ కాలనీలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి హుడా సీఎంగా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వీటిపై విచారణకు ఖట్టర్‌ ప్రభుత్వం 2015లో జస్టిస్‌ ధింగ్రా కమిటీ వేసింది. వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ  2008లో ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుంచి 3.5 ఎకరాల భూమిని రూ.7.50 కోట్లకు కొనుగోలుచేసి, హుడా పలుకుబడితో వాణిజ్య అనుమతులు పొంది ఆ భూమిని డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించిందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.

మరిన్ని వార్తలు