బాలికపై లైంగికదాడికి ప్రిన్సిపాల్‌ యత్నం

1 Nov, 2019 06:42 IST|Sakshi
అసద్‌బాబానగర్‌లోని మోషియన్‌ పాఠశాల, నిందితుడు ఇంతిజార్‌ అలీ

బహదూర్‌పురా: ఓ బాలికపై సాక్షాత్తు పాఠశాల ప్రిన్సిపాల్‌ లైంగికదాడికి యత్నించిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌లో ఇంతిజార్‌ అలీ అనే వ్యక్తి మోషియన్‌ పేరుతో ప్రీ ప్రైమరీ స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక (11) సదరు స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో సదరు బాలిక తల్లిదండ్రులు స్కూల్‌ ఫీజు చెల్లించలేకపోయారు. బాలికను పరీక్షకు అనుమతించాలని తల్లిదండ్రులు కోరడంతో ఆధార్‌ కార్డు, ఇతర పత్రాలు తీసుకొస్తే పరీక్ష రాయిస్తానంటూ ప్రిన్సిపాల్‌ ఇంతిజార్‌ అలీ చెప్పాడు. దీంతో బుధవారం తల్లిదండ్రులు బాలికను తీసుకొని పాఠశాలకు వచ్చారు. స్కూల్‌లో కంప్యూటర్‌ పని చేయడం లేదని బాలిక తల్లిదండ్రులను ఇంటికి పంపిన ప్రిన్సిపాల్‌ బాలికను స్కూల్‌లోనే ఉంచుకున్నాడు. సాయంత్రం ఆధార్‌కార్డును పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు గురువారం బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్‌ ఇంతిజార్‌ అలీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్సై నర్సింహ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. 

మండల డిప్యూటీ ఈవో విచారణ
దీనిపై సమాచారం అందడంతో బహదూర్‌పురా మండల డిప్యూటీ ఈవో వేణుగోపాల చారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులను విచారించారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై కేసులు నమోదు చేశారని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  మైనర్‌ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన పాఠశాల ప్రిన్సిపాల్‌ను అరెస్ట్‌ చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతారావు డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంటల్లో రైలు

డ్రంకెన్‌ డ్రైవర్‌కు ట్రాఫిక్‌ విధులు

అవినీతి సొమ్ముతో ఆభరణాలు

రియల్‌ ‘దృశ్యం’!

ఊపిరుండగానే ఉసురు తీద్దామనుకుని..

ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది..

‘దృశ్యం సెకండ్‌ పార్ట్‌లా ఉంది’

మరదలితో అసభ్య ప్రవర్తన; బావకు బేడీలు

‘చంపేస్తావా ఏంటి.. మర్యాదగా మాట్లాడు’

హైదరాబాద్‌లో దారుణం..

‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’

ఐస్‌ ప్యాక్‌లో ప్రమాదకర డ్రగ్స్‌ నింపి...

యువతిపై బాలుడి అత్యాచారం.. !

ఫోన్లో నగ్న వీడియోలు తీసి.. ఎయిర్‌హోస్టెస్‌ నిర్వాకం

రూ.3 కోట్లతో నగలు కొన్న దేవికా రాణి

చెడు నడవడి.. చేతులు తెగిపడి

స్నేహం పేరుతో వ్యభిచార కూపంలోకి

మీడియా ముందుకు శశికుమార్‌, కీర్తి

ప్రాణాలు తీసిన వేగం

ఖమ్మంలో భారీగా పట్టుబడ్డ పాత నోట్ల కట్టలు

కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా..

తండ్రిని చంపిన కొడుకు, కోడలు

నాన్నా నన్ను క్షమించు..  

బోగస్‌ ట్రావెల్‌ ఏజెన్సీ గుట్టురట్టు

పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు

గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం

‘ట్రిమ్‌విజన్‌’ పేరిట 230 మందికి టోకరా

ప్రాణాలు తీసిన కోడి పందెం

విషాదం : కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు

ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎస్‌.పి. రాజారామ్‌కు దర్శకుల సంఘం నివాళి

రాగల 15 రోజుల్లో...

సింగర్‌ టు నక్సలైట్‌!

లవ్‌ స్టోరీ

హై ఓల్టేజ్‌ యాక్షన్‌

జైలు నుంచి విడుదల