మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

2 Aug, 2019 07:55 IST|Sakshi
పోలీసు స్టేషన్‌ని ముట్టడించిన బంధువులు. (ఇన్‌సెట్‌) మృతి చెందిన సంజీవ్‌ (ఫైల్‌)

పోలీసుస్టేషన్‌ను ముట్టడించిన బంధువులు

చెన్నై ,అన్నానగర్‌: పల్లడమ్‌ సమీపంలో బుధవారం ఎనిమిదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బంధువులు పోలీసు స్టేషన్‌ని ముట్టడించారు. వివరాలు.. పల్లడమ్‌ సమీపంలో ఉన్న సెమ్మిపాలైయమ్‌ సుందరమ్‌ నగర్‌కు చెందిన శక్తివేల్‌ (40), తిలకమ్‌ (36) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజు అక్కడ ఉన్న ఓ పాఠశాలలో ప్లస్‌ – 1 చదువుతున్నాడు. చిన్న కుమారుడు సంజీవ్‌ (13) పెరుమ్‌బాల్‌లో ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు వెళ్లిన సంజీవ్‌ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సంజీవ్‌ తలుపువేసి ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దుకాణానికి వెళ్లిన తల్లి తలుపులు తెరిచే ప్రయత్నం చేసింది.

ఫలితం లేకపోవడంతో ఇంటి కిటికీలను తెరచి చూడగా సంజీవ్‌  ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ స్థితిలో సంజీవ్‌ బంధువులు, తల్లిదండ్రలు పోలీసు స్టేషన్‌ని ముట్టడించారు. దీని గురించి విద్యార్థి తండ్రి శక్తివేల్‌ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా సంజీవ్‌ చాలా నిరాశలో ఉన్నాడని, పరామర్శించినా సమాధానం లేదన్నాడు. సంజీవ్‌ ఆత్మహత్య కారణం ఏంటో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో సంజీవ్‌ చదివిన పాఠశాలకి వెళ్లిన కొంత మంది బంధువులు, పాఠశాలలో ఉన్న సీపీటీవీ కెమెరా దృశ్యాలను చూడాలని అడిగినందుకు పాఠశాల యాజమాన్యం ఒప్పుకోలేదని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు