టెక్‌ దంపతుల ప్రాణం తీసిన వేగం

29 Apr, 2018 07:44 IST|Sakshi
అశ్విని, అంజిరెడ్డి మృతదేహాలు

శ్రీశైలం ఘాట్‌రోడ్డులోఅదుపుతప్పి కారు బోల్తా

దంపతులు మృతి..

మరో ముగ్గురికి తీవ్రగాయాలు

బాధితులంతా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

సాక్షి, దోమలపెంట (అచ్చంపేట): ఒకవైపు ఉల్లాసం.. మరోవైపు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృ తిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అమ్రాబాద్‌ మండల పరిధిలోని శ్రీశైలం– హైదరాబాద్‌ ప్రధాన రహదారిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ బద్యానాయక్‌ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ టెక్‌మహేంద్రలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్న దంపతులు అంజిరెడ్డి(30) తన భార్య అశ్విని(28), అదే కంపెనీలో పనిచేస్తున్న మరో నలుగురు అలీ, కిషోర్‌కుమార్‌రెడ్డి, రవికిరణ్, రూకేష్‌తో కలిసి శ్రీశైలం దర్శనార్థం బయలుదేరారు.

దోమలపెంట అట వీ చెక్‌పోస్ట్‌కు సుమారు పది కి.మీ. దూరంలో  ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అంజిరెడ్డి, అశ్విని అక్కడికక్కడే మృతిచెందగా.. అలీ, కిషోర్‌కుమార్‌రెడ్డి, రవికిరణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్స అనంతరం రవికిరణ్, కిషోర్‌కుమార్‌రెడ్డిల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మెరుగైన వైద్య సేవలకొరకు పెద్దాసుపత్రికి సిఫార్స్‌ చేసినట్లు ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో రూకేష్‌ క్షేమంగా బయటపడ్డారు.

10 నెలల క్రితమే వివాహం..
అంజిరెడ్డి, అశ్వినిలకు 10 నెలల క్రితమే వివాహమైనట్లు రూకేష్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా వేముల గ్రామానికి చెందిన అంజిరెడ్డి శ్రీశైలంలో దర్శనం అనంతరం వారి స్వగ్రామానికి వెళ్లాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో దంపతులి ద్దరు ఒకేసారి మృతిచెందారని వాపోయారు.  పంచనామా నిమిత్తం మృతదేహాలను అమ్రాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అమ్రాబాద్‌ సీఐ రమేష్‌ కొత్వాల్, ఈగలపెంట ఎస్‌ఐ బద్యానాయక్, í సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

మరిన్ని వార్తలు