అత్తను చంపిన అల్లుడు

25 Feb, 2018 14:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కృష్ణా జిల్లా : పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అత్తను అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివరాలు..నాగాయలంక మండలం నాచుకుంట ఏసుపురం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శివలీల (52) కుమార్తె శశిరేఖకు వణుకూరులో నివసిస్తున్న కన్నా జోజి ప్రసాద్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేకపోవడంతో రెండు రోజుల క్రితం కుమార్తెను ఆసుపత్రిలో చూపించేందుకు శివలీల వణుకూరు వచ్చింది. శనివారం రాత్రి గేదె అమ్మగా వచ్చిన డబ్బులను మద్యం సేవించేందుకు భార్యను ప్రసాద్‌ అడగటంతో వివాదం మొదలైంది.

 గొడవ మధ్యలో అత్త శివలీల వెళ్లి మందలించింది. దీంతో అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రసాద్‌ బాగా మద్యం సేవించి తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన అనంతరం భార్య శశిరేఖతో మళ్లీ గొడవపడి గొడ్డలి తీసుకుని వెంబడించాడు. గమనించి అత్త అడ్డుపడటంతో కోపంలో అత్తను గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు