ఆడపిల్ల అని చంపేశారు 

11 Sep, 2019 04:08 IST|Sakshi
మృతదేహం ఖననం చేసిన స్థలం వద్ద అధికారులు

గొంతులో వడ్లగింజ వేసి ఘాతుకం 

రాయపర్తి: రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని గొంతులో వడ్ల గింజ వేసి రెండ్రోజుల పసిగుడ్డును చంపేశారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కేశవాపురం శివారు ఎర్రకుంట తండాలో మం గళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.  తండాకు చెందిన భూక్యా సాలమ్మ, లచ్చు నాయక్‌కు నలుగురు కుమార్తెలు, కుమారుడు తిరుపతి ఉన్నారు. తిరుపతికి మమతతో వివాహం జరిపించారు. వీరికి గత ఏడాది ఆడపిల్ల పుట్టింది. ఈ నెల 4న రెండో కాన్పులోనూ మమత మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది.

తల్లీకూతుళ్లు క్షేమంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. అయితే.. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని అక్కసుతో భూక్యా సాలమ్మ, లచ్చునాయక్‌లు ఈ నెల 7వ తేదీన పాప గొంతులో వడ్ల గింజ వేసి చంపారు. ఎవరికీ తెలియకుండా తమ పొలంలో మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే.. అసలు విషయం బయటకు పొక్కడంతో బాలల సంరక్షణాధికారి మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యాన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు.  ఫోరెన్సిక్‌ నిపుణులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి అవశేషాలను ల్యాబ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా